* క‌రోనాను ఓ మ‌తానికి అంట‌క‌ట్టేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓ మ‌తానికి చెందిన వారి వ‌ల్లే వ్యాప్తి చెందుతోంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ఓ వ‌ర్గం తీవ్ర మాన‌సిక ఇబ్బందికి గుర‌వుతోంది. ఇలాంటి దుష్ప్ర‌చారం వ‌ల్ల వారు స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇలా ప్ర‌చారం చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య‌. నిజానికి..  క‌రోనాకు మ‌తం లేదు. కులం లేదు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఈ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలి. ఒక‌రికొక‌రం సాయంగా ఉండాలి* అని తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  క‌రోనాను ఓ మ‌తానికి అంట‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న సూచించారు. బుధ‌వారం ఆయ‌న ఓ చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని, అన‌స‌వ‌ర‌మైన ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని ఆయ‌న సూచించారు. తెలంగాణ‌లో కరోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు. 

 

లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనేక ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. నిరంత‌రం అధికార‌యంత్రాంగాన్నిఅప్ర‌మ‌త్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా పేద ప్ర‌జ‌లు, ఇత‌ర రాష్ట్రాల నుంచి బ‌తుకుదెరువు కోసం వ‌చ్చిన వ‌ల‌స కార్మికులు, కూలీల‌ను ఆదుకునేందుకు బియ్యంతోపాటు రూ.500ను అందించారు. అంతేగాకుండా.. క‌రోనా బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌ల‌ను అందిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌నుపాటించాల‌ని, చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సామాజిక దూరం పాటించ‌డం వ‌ల్లే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌గ‌లుగుతామ‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌జులుగ‌మ‌నించి, అందుకుత‌గ్గ‌ట్టుగా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: