ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చస్తుంది.  ఇప్పటివరకు 5,194 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రులలో 4,643 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం ప్రతిపక్ష పార్టీ నేతలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనాపై చర్యలు, లాక్ డౌన్ పొడిగింపుపై చర్చలు జరపనున్నారు.  ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ బెదిరింపులకు లొంగి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని పాక్షికంగా సడలించిందని ఆరోపించింది.

 

అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా కరోనా పీడిత ప్రాంతమే కదా.. ఇలాంటి పరిస్థితిల్లో అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.  తాజాగా ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీజీ, చైనీస్ చొరబాట్లపై యూపీఏ మీ సలహాను గుర్తుంచుకుంటుంది. మీరు వారి కళల్లో చూడండి అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్‌ కళ్లలో చూడాల్సిన సమయం వచ్చింది. ఆయన బెదిరింపుల విషయం ప్రపంచం మొత్తం గమనిస్తుందని అన్నారు.  మీరు ఆయన బెదిరింపులకు లొంగిపోయిన   అనుమతి ఇచ్చేశారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది? అంటూ అసహనం వ్యక్తం చేశారు.  

 

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ తమకు ఇవ్వకపోతే వాణిజ్యపరంగా ప్రతీకారం తప్పదని డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ బెదిరింపులను కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌, జైవీర్‌ షెర్గిల్‌ ఖండించారు.  ఇక ప్రాణాలను రక్షించే మందులు మొదట భారతీయులకు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచాలని, తర్వాతే మిగతా దేశాలకు సరఫరా చేయాలని రాహుల్‌ గాంధీ అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: