తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటవ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరుకుంది. ఇంకా కరోనా పాజిటివ్ రావడంతో 397 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది వరకూ తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందారు. అయితే తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ గడువు గురువారంతో పూర్తి కానుండటంతో నేడు వారిని డిశ్చార్జ్ చేయనున్నారు. దాదాపు 25 వేల మందికి నేటితో తెలంగాణలో క్వారంటైన్ నుంచి విముక్తి క‌ల‌గ‌నుంద‌ని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. 

రాష్ట్రం నుంచి 1,100 మంది వరకు మర్కజ్‌కు వెళ్లొచ్చారని, అందరికీ పరీక్షలు చేయించినట్లు మంత్రి ఈటల తెలిపారు. వీళ్లను కూడా ఇళ్లకు పం పిస్తామన్నారు. ప్రస్తుతం 167 సెంటర్లలో 3,158 మంది క్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. వీళ్లంతా మర్కజ్‌ వెళ్లిన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ పర్సన్స్‌ అని పేర్కొన్నారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు ఈ నెల 21 వరకు ఇళ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆయ‌న‌ స్పష్టంచేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: