మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల తరువాత ఇండియాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి . ముఖ్యంగా ఢిల్లీ వెళ్లివచ్చిన వారినుండి కరోనా వేగంగానే విస్తరిస్తోంది . ఇప్పటివరకు ఇండియాలో 6 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 157  మృత్యువాత పడ్డారు .తెలుగు రాష్ట్రాల్లో నానాటికి కరోనా కలకలం పెరిగిపోతోంది , ఒక్క హైదరాబాద్ లో నిజాముద్దీన్ ప్రధానాలకు వెళ్లివచ్చిన వారి సంఖ్య 603  మంది కాగా 593 మందికి టెస్టులు చేసారు వారిలో 63 మందికి కరోనా పాజిటివ్ అనితేలింది .వారంతా కూడా హైదరాబాద్ కి చెందినవారే కావడం విశేషం . 

 

అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 63  మందికి చెంది ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్బంధంలో ఉంచింది . అదేవిధంగా ఆయా ప్రాంతాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది . ఈ ప్రాంతాల వారిని ఇంటినుంచి బయటకు రావద్దని హెచ్చరించింది . నిత్యావసర సరుకులను నేరుగా ఇంటివద్దకు పంపేవిధంగా ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో 12 కంటెయిన్మెంట్ క్లస్టర్లు


రాంగోపాల్ పెట్ , షేక్ పెట్ ,రెడ్ హిల్స్ ,మలక్ పెట్ ,చంద్రాయ గుట్ట , ఆల్వాల్ , మూస పెట్ ,కూకట్ పల్లి , యూసఫ్ గూడా , కుత్బుల్లా పూర్,ఆర్ సి పురం మయూరి నగర్ , చందానగర్ లో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించారు 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: