ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్ సార్క్( సౌత్ ఏషియ‌న్ అసోసియేష‌న్ ఫ‌ర్ రీజ‌న‌ల్ కో ఆప‌రేష‌న్‌) దేశాల్లో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేదు. యూర‌ప్‌, అమెరికాతో పోల్చితే సార్క్ దేశాల్లో కొవిడ్‌-19 ప్ర‌భావం చాలా త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పొచ్చు. సార్క్‌లో ఇండియా, అఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దివులు, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీ‌లంక దేశాలు ఉన్నాయి. వీటిల్లో క‌రోనా ప్ర‌భావం భార‌త్‌, పాకిస్తాన్‌లో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.  జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ అందించిన వివ‌రాలు ప్ర‌కారం ఏప్రిల్ 9 న ఉదయం 11గంట‌ల వ‌ర‌కు సార్క్ దేశాల్లో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. భారతదేశం: 5,734 కేసులు,  ఆఫ్ఘనిస్తాన్: 444, బంగ్లాదేశ్: 218, భూటాన్: 5, మాల్దీవులు: 19, నేపాల్: 9, పాకిస్తాన్: 4,263, శ్రీలంక: 189 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

సార్క దేశాల్లో పాకిస్తాన్‌, భార‌త్‌ల‌లోనే క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. దాదాపుగా ఈ రెండు దేశాల్లో కేసుల సంఖ్య‌లో కొద్దిపాటి తేడా మాత్ర‌మే క‌నిపిస్తోంది. భార‌త్‌లో 5, 734 కేసులు న‌మోదు కాగా, పాకిస్తాన్ 444 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత అఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీ‌లంక‌లో క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. అఫ్ఘ‌న్లో 444 కేసులున‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వా బంగ్లాదేశ్‌లో 218, శ్రీ‌లంక‌లో 189 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. భార‌త్ ప‌క్క‌నే ఉన్న నెపాల్‌లో 9, భూటాన్‌లో 5 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అంటే ఈ రెండు దేశాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దాదాపుగా లేద‌నే చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: