కరోనా వైరస్ ప్రపంచాన్ని అంధకారమయం లో పడేస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఇటలీ , అమెరికా మరియు స్పెయిన్ దేశాలు . మరి మన దేశంలో మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల తరువాత పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు దేశ భవిష్యత్తును అతలాకుతలం చేస్తున్నాయి .  ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు భారత ప్రజలందరూ లచ్క్ డౌన్ ను సంగీభావం తెలుగుపుతున్నారు . అదేవిధంగా డాక్టర్స్ , పోలీసులు మరియు పారిశుధ్య కార్మికులు  తమ విధులను నిర్వహిస్తున్నారు . మన ఆరోగ్యం కోసం వారు రేయిపగళ్ళు కష్టపడుతున్నారు .

 

వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది . భోపాల్ జిల్లాలో వైద్యం అందిస్తున్న 50  మంది డాక్టర్స్ కి అదేవిధంగా రోడ్లపై గస్తికాస్తున్న 12 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా  నమోదుకావడం జరిగింది . అదేవిధంగా తబ్లీగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన 20 మందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది మరియు  ఒకరు చనిపోయారు అని సమాచారం . మధ్యప్రదేశ్ లో మొత్తం 227  పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం 13  మంది చనిపోయారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: