కరోనా మహమ్మారి ధాటికి దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదుకాగా, కొత్తగా  హాట్ స్పాట్ ల ప్రకటనతో ఢిల్లీ ఉలిక్కిపడింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో కొత్తగా మూడు కేసులు వెలుగుచూడటంతోపాటు ఓ వ్యక్తి మరణించాడు. దాంతో ఇక్కడ రెడ్ జోన్ ప్రకటించారు.  లాక్ డౌన్ కొనసాగుతున్నా సిటీలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో బృహన్ ముంబై కార్పొరేషన్ 'తప్పని సరి మాస్క్' ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలో మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాపించే ముప్పు తగ్గుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

 

మాస్కులు లేకుంటే కనీసం కర్చీఫ్ అయినా వాడాలని ఆయన సూచించారు.  ‘తబ్లిగీ జమాత్’ కేంద్ర స్థావరంగా కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానికి సమీపంలోని ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దాంతో  వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు  కీలక నిర్ణయం తీసుకున్నాయి. రోజు రోజుకీ కరోనా ఎఫెక్ట్ మరి పెరిగిపోవడంతో ఢిల్లీలోని 13 ప్రాంతాలు, నొయిడాలో 22, ఘజియాబాద్‌లో మరో 13  హాట్ స్పాట్లను బుధవారం అర్ధరాత్రి నుంచి అష్ట దిగ్బంధనం చేశాయి.

 

ఇప్పటికే తూర్పు ఢిల్లీ జిల్లా అధికారులు ఎనిమిది ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా గుర్తించారు. దాంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ప్రాంతాల్లోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కానున్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో దిగ్బంధం చేసిన ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు. మెడిసిన్, నిత్యావసర సరుకులు ఇళ్లకే పంపిస్తారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: