క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను చుట్టేసింద‌ని చెప్పుకుంటున్నా.. నిజానికి కొన్ని దేశాల‌నే అత‌లాకుత‌లం చేస్తోంది. చాలా దేశాల్లో అతి త‌క్కువ ప్ర‌భావ‌మే ఉంది. చైనాలోని వుహాన్‌న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్‌.. యూర‌ప్ దేశాల‌తోపాటు అమెరికా త‌దిత‌ర దేశాల‌ను చుట్టేసింది. ఇక ప్ర‌పంచ మ‌ర‌ణాల్లో యూర‌ప్‌లోనే దాదాపుగా 40శాతానికిపైగా ఉన్నాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  ఇదే స‌మయంలో ఏషియ‌న్( ది అసోసియేష‌న్ ఆఫ్ సౌతీస్ట్ ఏషియ‌న్ నేష‌న్స్‌) దేశాల్లో మాత్రం అంత‌గా ప్ర‌భావం చూప‌డం లేదు. ఇందులో ఒక‌టి రెండు దేశాల్లో మాత్ర‌మే కొద్దిమేర‌కు ప్ర‌భావం చూపుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ ఏప్రిల్ 9 న విడుద‌ల చేసిన కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

 బ్రూనై: 135 కేసులు, కంబోడియా: 117 , ఇండోనేషియా: 2,956, లావోస్: 15,  మలేషియా: 4,119, మయన్మార్: 22, ఫిలిప్పీన్స్: 3,870, సింగపూర్: 1,623, థాయిలాండ్: 2,369,  వియత్నాం: 251 కేసులు న‌మోదు అయ్యాయి. ఏషియ‌న్ దేశాల్లో లావోస్‌, బ్రూనై, వియ‌త్నం, సింగ‌పూర్లో చ‌లా త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక మిగ‌తా దేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త ఎక్కువ‌గానే ఉంది. ఇందులో కూడా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉండే మ‌లేషియా,  థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్సలో కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. ఏదిఏమైనా.. యూర‌ప్ దేశాలు, భార‌త్‌, అమెరికాతో పోల్చితే మాత్రం క‌రోనా చాలా త‌క్కువ ప్ర‌భావం చూపుతోంద‌ని తెలుస్తోంది. ఈ గ‌ణాంకాల‌ను ఆధారంగా.. అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణాలు సాగించే దేశాల్లోనే క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: