కరోనా కాలసర్పం తన విషపు కోరలను ప్రపంచ నలుమూలల వ్యాపింప చేస్తోంది. దీని విషపు కోరల్లో ప్రపంచ దేశాలు ఇరుక్కుపోయి విలవిలలాడుతున్నాయి. వేడిమి , శీతలం దీనిని ఏమి చేయలేక పోవడంతో దీని విజృంభణ చెప్పశక్యము కానిది. కరోనా దెబ్బకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి . మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల పుణ్యమా అని కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.

 

గుంటూరులో యాభై కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది . అయితే గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ రావడం జరిగింది . అతను నరసరావుపేటలో చనిపోవడంతో నగరవాసులు బయాందోళనకు గురవుతున్నారు , ఈ వ్యక్తి పూర్వం క్షయ వ్యాధితో బాధపడేవాడు. ఈ కారణంగానే తనకి కరోనా వచ్చిందని నగరవాసులు భావిస్తున్నారు. అయితే ఈయన ఒక కేబుల్ కలెక్షన్ ఏజెంట్ అని తెలుస్తోంది. ఇతను పనిచేసినటువంటి ప్రాంతాలను రెడ్ జోన్లు గా ప్రభుత్వం ప్రకటించింది .
వరవ కట్ట, రామిరెడ్డిపేట మరియు పల్నాడురోడ్ లను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: