అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ మ‌ళ్లీ ప్ర‌పంచ సంప‌న్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ త‌న 34వ‌ వార్సిక బిలియ‌నీర్ల జాబితాను తాజాగా విడుద‌ల చేసింది. 113 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బేజోస్ ప్ర‌పంచంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఇక‌ రెండో స్థానంలో 98 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బిల్ గేట్స్ నిలిచారు. ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ .. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న సంప‌ద 76 బిలియ‌న్ల డాల‌ర్లు. ఆ త‌ర్వాత‌ వారెన్ బ‌ఫెట్ నాలుగో స్థానానికి ప‌డిపోయారు. బ‌ఫెట్ ఆస్తులు 67.5 బిలియ‌న్ డాల‌ర్లు ఉన్న‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అయితే తాజా లిస్టులో జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ బేజోస్ చేర‌డం గ‌మ‌నార్హం.  36 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో ఆమె 22వ స్థానంలో నిలిచారు. కోవిడ్19 మ‌హ‌మ్మారి వ‌ల్ల సంప‌న్నుల జాబితా నుంచి సుమారు 267 మంది చోటు ద‌క్కించుకోలేక‌పోయారు.  దాదాపు వెయ్యి మంది వ‌ర‌కు త‌మ ఆస్తుల‌ను కోల్పోయారు.

 

అయితే.. క‌రోనాతో ప్ర‌పంచం మొత్తం స్తంభించిపోయింది. దాదాపుగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. వ్యాపార‌, వాణిజ్యం రంగాలు మొత్తం కూడా కుదేల‌య్యాయి. ఇంత‌టి క‌ష్ట‌కాలంలో కూడా అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ స‌త్తాచాటారు. ఫోర్బ్స్ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచారు. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆయ‌న భార్య మెకంజీ బెజోస్ కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం. ఆమె ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం కూడా చెప్పుకోవాలి. క‌రోనా దెబ్బ‌తో సుమారు వెయ్యిమందికిపైగా వ్యాపారులు త‌మ ఆస్తుల‌ను కోల్పోయిన‌ట్లు అంత‌ర్జాతీయంగా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు 267మందికిపైగా ఫోర్బ్స్ తాజా జాబితాలో చోటు ద‌క్కించుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: