క‌రోనా ఎఫెక్ట్ ఇంధ‌న వినియోగంపై కూడా ప‌డింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఇంధన వినియోగం భారీగా తగ్గింది. దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో గత నెలలో ఇంధన వినియోగం 18 శాతం తగ్గింది. ఇంధన వినియోగం ఈ స్థాయిలో క్షీణించడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. డీజిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన (ఏటీఎఫ్) డిమాండ్ తగ్గడంతో దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం మార్చిలో  17.79 శాతం తగ్గి 16.08 మిలియన్ టన్నులకు పడిపోయినట్టు గురువారం విడుదలైన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

లాక్‌డౌన్ కారణంగా రైళ్లు, ట్రక్కులు, బస్సులు సహా ఇతర వాహనాలు నిలిచిపోవడంతో డీజిల్ వినియోగం కూడా భారీ పడిపోయింది. పెట్రోలు అ మ్మకాలు 16.37 శాతం తగ్గి 2.15 మిలియన్ టన్నులకు పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం ఈ నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మరింత కాలం కొనసాగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లోనూ ఇంధన వినియోగం అంతంత మాత్రంగానే ఉండనుందని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: