ఓ పక్క కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తే . మన తెలుగు రాష్ట్రాల నాయకులూ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. మరి నిభందనలు సామాన్యులకే మనకు కాదు అన్న చందాన నేతలు ప్రవత్తిస్తున్నారు . కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి సోషల్ డిస్టెన్స్ ముఖ్యమని కేంద్రం నెత్తి నోరు బాదుకుంటున్న నేతలు పెడచెవిన పెడుతున్నారు. 

 

వివరాలలోకి వెళితే వైసీపీ ఎమ్మెల్యే విజయసాయిరెడ్డి గారు ఇటీవల కరోనా రిలీఫ్ మెజర్స్ పేరిట ఓ భారీ సభను ఏర్పాటుచేసారు .  శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రగతి భర్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో covid-19  రిలీఫ్ మెజర్స్ పేరిట ఓ భారీ సభను ఏర్పాటుచేసారు.  ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ తరుపున పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు వగైరా అందించాడని విజయ సాయి రెడ్డి అక్కడకు వచ్చారు . కానీ కరోనా కోసం పాటించవలసిన కనీసపు నియమాలను సదరు ఎమ్మెల్యే పాటించలేదు . కాగా పదుల సంఖ్యలో మెంబెర్స్ మరియు కార్యకర్తలు గుమికూడి సోషల్ డిస్టెన్స్ కు తూట్లు పొడిచారని విజయ సాయి రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: