హైద‌రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఈసీఐఎల్‌, నాగారం, జవహార్‌ నగర్‌, కీసర త‌దిత‌ర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్ప‌టికే హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. అయితే.. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే న‌గ‌రంలో 12 హాట్‌స్పాట్ల‌ను గుర్తించి, క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లను ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేసింది. 

 

దాదాపు హాట్‌స్ప‌ట్ల‌ను మొత్తం అధికారులు దిగ్బంధం చేశారు. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. చింత‌ల్‌బ‌స్తీ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌రిస్థితి కొంత ఆందోళ‌న‌క‌రంగా ఉంది. నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అధికారులే స‌ర‌ఫ‌రా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే.. న‌గ‌రంలో మ‌ల్లెప‌ల్లి బ‌డే మ‌సీద్ ప్రాంతాన్ని కూడా హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఈ ప్రాంతంలో మూడు పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లోకి ఎవ‌రూ రాకుండా క‌ట్టుదిట్టంగా  అయితే.. ఈ స‌మ‌యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తుండ‌డంతో వైర‌స్ వ్యాప్తి వేగం పుంజుకుంటుందోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రెండు రోజుల‌పాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: