వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు.  ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంటే.. ఇదే సమయానికి వరుణ దేవుడు తన కోపాన్ని చూపిస్తున్నారు.  అసలే ఎండాకాలం.. ఎండలు దంచి కొట్టే సమయానికి అనూహ్యంగా వర్షాలు పడటం  అందరికీ షాక్ ఇచ్చింది.  తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్ హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది.

 

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని.. అయితే దీనిపై వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. నెల్లూరు లో సైతం వర్షాలు బీభత్సంగా పడటం.. పిడుగు పాటుకి అక్కడ ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి.  కాగా, తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి  అక్కడక్కడ భారీ నుంచి ఒక మోస్తర వర్షాలు కురవనున్నాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: