కరోనా మహమ్మారికి ఎల్లలు లేవని మరోసారి రుజువైంది , ప్రపంచదేశాలు కరోనా దెబ్బకు అతలా కుతలం అవుతున్నాయి , కరోనా మరణాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది , ఇండియా పట్టిపీడిస్తున్న ఒకే ఒక విషయం మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలు . ఈ ప్రార్ధనల కారణంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం .

 

 

వివరాలలోకి వెళితే సింగరేణిలో కరోనా రాకాసి తిష్టవేసి చాపకింద నీరులా వాపిచింది . ఆలస్యంగా వెలుగు చుసిన ఈ సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది . మర్కజ్ నిజాముద్దీన్ కి వెళ్లి వచ్చినా సింగరేణి కార్మికుడు ఆ విషయాన్నీ దాచి పెట్టి విధులను నిర్వహించడం జరిగింది . మరి రాకాసి ఊరుకోదుగా మరి కొన్ని రోజులకే సదరు వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చింది , దానితో అతనిని అతని కుటుంబబ్బి టెస్టులకు పంపించగా పాజిటివ్ అని తేలింది . మేల్కొన్న సింగరేణి యాజమాన్యం సదరు వ్యక్తితో పనిచేసిన వారందిరిని క్వారంటైన్ కి టెస్టుల కోసం పంపారు . మిగతా కార్మికులు పనిచేయడానికి సంకోచిస్తూ భయాందోళనకు గురౌతున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: