బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. లండన్లోని థామ‌స్‌ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతును ఆయ‌న‌ను గురువారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు. దీంతో ఆదేశ ప్ర‌జ‌ల‌తోపాటు ప్ర‌పంచ దేశాధినేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నివారాల క్రితం బోరిస్ జాన్స‌న్ క‌రోనాతో పోరాడుతున్నారు. నిజానికి కొన్ని ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌గానే వెంట‌నే ఆయ‌న సెల్ఫ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. అక్క‌డే కొద్దిరోజులు ఉన్నారు. అయితే.. ఒక్క‌సారిగా ఆయ‌న ఆరోగ్యం విష‌య‌మించ‌డంతో గ‌త సోమ‌వారం వెంట‌నే లండ‌న్ ఆస్ప‌త్రిలోని ఇంటెన్సివ్ కేర్లో చేరారు. ఒక ద‌శ‌లో ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉందంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. అక్క‌డే చికిత్స పొందిన జాన్స‌న్ ఎట్ట‌కేల‌కు కోలుకోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. 

 

ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా దేశాధినేత‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు.. ఇది అద్భుత‌మ‌ని అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుత‌మంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇంత‌కుముందు ప్రిన్స్ చార్లెస్ కూడా క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. ఆయ‌న భార్య కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ వ‌చ్చింది. బ్రిట‌న్‌లో ఇలా చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా.. బ్రిట‌న్‌లోనూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. అక్క‌డ కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇక యూకేలో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 8వేల మంది మ‌ర‌ణించారు. గురువారం ఒక్క రోజే 881 మంది మ‌ర‌ణించారు. అంతకు ముందు రోజు 938 మంది మ‌ర‌ణించారు. అయితే.. ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాని జాన్స‌న్ కోలుకోవ‌డంతో క‌రోనా క‌ట్ట‌డికి మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: