క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ‌త డిసెంబ‌ర్‌లో చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్ వాయువేగంతో నేడు ప్ర‌పంచ దేశాల‌ను చుట్టేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15, 77, 363 మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డిన ప‌డ‌గా, అందులో 93, 637 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. చి న్నాపెద్దా, రాజు, పేద అనే తేడా లేకుండా అంద‌రినీ క‌బ‌ళిస్తోంది క‌రోనా.  

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు త్వ‌ర‌గా ఈ వైర‌స్ భారిన ప‌డుతున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. వైర‌స్ సోకిన వ్య‌క్తుల‌కు చికిత్స అందిస్తున్న ప‌లువురు వైద్యుల‌కు కూడా ఈ వైర‌స్ సంక్ర‌మించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఢిల్లీలో వెలుగుచూసింది.  

కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ద‌వాఖాన‌లో చేరిన ముగ్గురు రోగులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.  అయితే ఆసుపత్రిలో చేరిన కేన్సర్ రోగులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా కరోనా సోకిందని వైద్యులు భావిస్తున్నారు. దీంతో కరోనా సోకిన కేన్సర్ రోగులను రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. 

అనంతరం ఢిల్లీ స్టేట్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిని శానిటైజ్ చేయించి తాత్కాలికంగా మూసివేశారు. ఆసుపత్రిలో ఉన్న మరో 19 మంది కేన్సర్ రోగులను ఇతర ద‌వాఖాన‌ల‌కు తరలించారు.  ఢిల్లీలోని 25 హాట్ స్పాట్లలో కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటంతో అందరూ మాస్క్ లు ధరించాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: