దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైద్య రంగాన్ని జాగరూపం చేస్తూ కరోనా బాధితులకు వైద్యం అందించే విధంగా చూస్తుంది.  దేశంలో మొదట కేరళాలలో ఈ కరోనా లక్షనాలు కనిపించినా తర్వాత అన్నా రాష్ట్రాలకు వ్యాపిస్తూ వచ్చింది.  అయితే కరోనా ప్రభావం ఎక్కువగా మహరాష్ట్ర, తమిళనాడు, కేరళా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉంది.  వైద్యులు ఎప్పటికప్పడు అలర్ట్ గా ఉంటూ తమ సేవలు కొనసాగిస్తున్నారు.  

 

దురదృష్టం ఏంటంటే అలా వైద్య సేవలు అందిస్తున్న వారికి కూడా కరోనా లక్షణాలు బయట పడుతున్నాయి.  తాజాగా అనంతపురం దారుణం జరిగింది.. మంచి నీళ్లు అనుకొని  మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్‌ తాగడంతో అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అనిల్‌ కుమార్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.   శుక్రవారం ఉదయం ఇంట్లో హడావుడిగా మంచినీళ్లు అనుకొని  శానిటైజర్‌ను రెండు గుటకలు వేశారు.

 

వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని, చికిత్స అనంతరం 2..3గంటల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రికి చేరుకుని అనిల్‌కుమార్‌ను పరామర్శించారు.  ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి పరవాలేదు అంటున్నారు వైద్యుులు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: