దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా మరణాలు.. కేసులు చూస్తుంటే భయాందోళనకు గురి అవుతున్నారు ప్రజలు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కి సరైన వైద్యం లేదు.. యాంటీ డోస్ కనుగొనలేక పోయారు.  దాంతో ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత బతికి బట్టకడతాం అని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం భారత దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా కొన్ని చోట్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మరణాలు ఒక్కొక్కటిగా నమోదు అవుతూనే ఉన్నాయి.  కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇతరులకు ఈ కరోనా సోకవడం దారుణమైన విషయం.

 

మరికొంత మంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకోక చిన్న చిన్న వైద్యులను సంప్రదించి అప్పటికప్పుడు ఉపశమనం పొందినా.. తర్వాత సీరియస్ కావడంతో బయటకు వస్తున్నారు. తాజాగా జ‌మ్మూలోని టిక్రీలో ఓ మ‌హిళ క‌రోనాతో నిన్న ప్రాణాలు విడిచింది. అయితే  12 మంది ఆ మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉదంపూర్ కు చెందిన‌వారు కాగా..వీరికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే న‌లుగురికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్లు ఉదంపూర్ జిల్లా క‌మిష‌న‌ర్ తెలిపారు.

 

కంటైన్ మెంట్ ప్ర‌ణాళిక క‌ఠినంగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. ప్రస్తుతం ఈ కేసుల నేప‌థ్యంలో టిక్రీని రెడ్ జోన్ గా ప్ర‌క‌టించిన‌ట్లు చెప్పారు. . మ‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ లో లాక్ డౌన్ తో రెక్కాడితే కానీ డొక్కాడ‌నీ పేద ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, అధికారులు పంపిణీ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: