దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విస్తరిస్తూనే ఉంది.  ప్రస్తుతం కరోనా కట్టడి చేసే ప్రక్రియలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కానీ కొంత మంది అజ్ఞానుల వల్ల కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉంది.  ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో తబ్లీఘీ జమాత్ సదస్సు.. భారత్‌లో కరోనా కేసుల లెక్కల స్వరూపాన్నే మార్చివేసింది. మర్కజ్ లింక్ బయటపడిన తర్వాతే దేశంలో పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బీహార్ లో ఇప్పటి వరకు దాదాపు 60 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో మరీ దారుణమైన విషయం ఏంటేంట.. అక్కడ మూడో వంతు కేసులు ఒకే  కుటుంబానికి చెందినవి కావడం కలకలం రేపుతోంది.

 

రాష్ట్ర రాజధాని పాట్నాకు 130 కిలోమీటర్ల దూరంలో సివాజ్ జిల్లాలో ఈ కేసులు నమోదయ్యాయి.  ఇటీవల ఒమన్ నుంచి తిరిగొచ్చిన ఒక వ్యక్తి నుంచి ప్రారంభమైంది. మార్చి 16 ఈ వ్యక్తి  భారత్ కు తిరగి వచ్చాడు. ఏప్రిల్ 4న ఇతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈలోగా ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. ఈ క్రమంలో ఆయన నుంచి కుటుంబంలోని మరో 22 మందికి వైరస్ సోకింది. వీరందరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

 

ఇతని వల్ల మహిళలు, చిన్నారు, వృద్దులకు కరోనా వైరస్ సోకింది. గ్రామంలోని మరో ఇద్దరు కూడా దీని బారిన పడ్డారు. అయితే ఈ వ్యక్తి కుటుంబంలో 23 మందిలో ఇద్దరు మాత్రం కరోనా నుంచి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మరో రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంచుతామని అంటున్నారు. కాగా, ఈ ప్రాంతంలోని 43 గ్రామాలను అధికారులు పూర్తిగా నిర్బంధించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: