భారత్‌లో చిక్కుపోయిన తమ దేశస్త‌లను స్వదేశానికి త‌ర‌లిస్తోంది బ్రిటన్‌..  లాక్‌డౌన్ నేపథ్యంలో ప‌లువురు బ్రిట‌న్ దేశ‌స్తులు మ‌న దేశంలో చి క్క‌కుపోయారు. అయితే వారంద‌రికీ క్వారంటైన్ పూర్త‌వ‌డంతో ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరులను ఇక్కడి నుంచి తీసుకెళుతోంది. ఈ మేర‌కు బుధవారం అర్ధరాత్రి  316 మంది ప్రయాణికులతో కూడిన విమానాలు గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి నేడు లండన్‌ చేరుకున్నాయి. గ‌తంలో కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న త‌మ వారిని ప్ర‌త్యేక విమానాల ద్వారా అమెరికా స్వ‌దేశానికి త ర‌లించిన విష‌యం తెలిసిందే.

 

అయితే భారత్‌ అధికారికంగా ఎటువంటి విమానాల‌ను నడపడం​ లేదు. ఇక్కడ చిక్కుకుపోయిన వివిధ దేశాల పౌరులను తీసుకెళ్లేందుకు మాత్రమే ఆయా దేశాల విమానాలను అనుమతిస్తోంది. కరోనా నివారణలో ఉపయోగించే వైద్య పరికరాలు, ఔషధాల ఎగుమతులు- దిగుమతులకు ప్రత్యేక అనుమతితో కేంద్ర ప్రభుత్వం విమానాలు నడుపుతోంది. ఏప్రిల్‌ 30 వరకు టిక్కెట్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ అనుమతించబోమని ఎయిర్‌ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: