మ‌న‌దేశంలో గంట గంట‌కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే మ‌న దేశంలో వ‌ర‌ల్డ్ మీట‌ర్ ప్రకారం క‌రోనా పాజిటివ్ కేసులు 6725 వ‌ర‌కు ఉన్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు అధికారికంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్క‌ల ప్ర‌కారం 199 ఉన్నా... ఇవి ఇప్ప‌టికే 226కు చేరుకున్నాయ‌ని అంటున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా కోర‌లు చాస్తూ దూసుకుపోతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 678 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయని, మహమ్మారి బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

 

ఇక ప్ర‌స్తుతం 5709 పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం చురుగ్గా ఉండగా 503 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 1300 మార్క్‌ను దాటిందని ముంబైలో 381 ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించారని తెలిపారు. ఇక మ‌రో డేంజ‌ర్ ప‌రిస్థితి కూడా మ‌న దేశానికి పొంచి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. క‌రోనా త్వ‌ర‌లోనే భార‌త్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. 

 

దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులున్న 5911 మందిని పరీక్షించగా వారిలో 102 మందికి కరోనావైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని, వారిలో 40 మందికి కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన ఉదంతం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఇక దేశంలో ఉన్న మొత్తం క‌రోనా మ‌ర‌ణాల్లో 1500 కేసులు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాలు కూడా అక్క‌డే న‌మోదు అయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: