కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించి, 133 ఏరియాల‌ను రెడ్‌జోన్ లుగా  ప్రకటించింది. లాక్‌డౌన్ ను ప‌టిష్టంగా అమ‌లు ప‌రుస్తూ క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తోంది. మ‌రోప‌క్క లాక్‌డౌన్ వ‌ల్ల ఏ ఒక్క‌రూ ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతో పేద‌ల‌కు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణ‌యించింది. 

 

రాష్ట్రంలోని 1.3 కోట్ల మందికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన‌ట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. వీరితో పాటు కొత్తగా బియ్యంకార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌రో మూడు ల‌క్ష‌ల మందికి కూడా ఉచిత రేష‌న్‌తోపాటు రూ. వెయ్యి  ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్  ఆదేశించార‌ని మంత్రి వెల్ల‌డించారు. వీరికి కూడా త్వ‌ర‌లోనే ఉచితంగా రేష‌న్ అంద‌జేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.  గ్రామ వ‌లంటీర్ల ద్వారా వెయ్యి రూపాయ‌లు అందిస్తాన‌ని మంత్రి నాని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: