ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసింది. శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు 16 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు అధికార‌లు వెల్ల‌డించారు. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 381 చేరుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే.. శుక్ర‌వారం మ‌రో 16 కేసులు కొత్త‌గా న‌మోదు కావడంతో ఆ సంఖ్య 381కి చేరుకుంది. కరోనాతో కోలుకుని ఇప్పటివరకు  10 మంది డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు చనిపోయారు. గ‌త రోజుల‌తో పోల్చితే కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టు దిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. తాజాగా.. ఏపీలో  మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్‌జోన్లు గుర్తించారు. కర్నూలు (22), కృష్ణా(16), గుంటూరు(12), పశ్చిమ గోదావరి(12), ప్రకాశం(11),విశాఖ పట్నం(6) జిల్లాలో ఎక్కువ రెడ్‌జోన్లు ఉన్నాయి. బుధ‌వారం రాత్రి వ‌ర‌కు ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 365కు చేరింది. 

 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ పేషెంట్లు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ కస్టర్లుగా ప్ర‌భుత్వం గుర్తించింది. వెంట‌నే ఆయా ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని కంటైన్మెంట్ అంటే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవ‌డం.. క్లస్టర్ల పరిధిలో గుర్తించిన రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లను పోలీస్‌ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీస్‌ గస్తీ ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసులు న‌మోదుచేసేందుకు కూడా పోలీసులు సిద్ధ‌మవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: