కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ తెలంగాణ సర్కార్ ఈ శనివారం తెలంగాణ కాబినెట్ మీటింగ్ జరపనుంది . ఈ సమావేశం లో కరోనా గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా కట్టడి ని పెంచే పలు అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని పొడిగించాలని సమాచారం అందుతున్నా కే సి ఆర్  గారు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. అదేవిధంగా సమావేశం ముగిసినవెంటనే విలేకరుల సమావేసంలో ప్రకటిస్తారు. 


భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు మరియు  ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం లాంటి విషయాల పై కేసీర్ గారు పలు ఆసక్తి కార నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణాలో 487  కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 12 మంచి చనిపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్క రోజే 16 కొత్త కేసులు నమోదు కాగా అన్ని వెరసి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 387 కు చేరింది అదేవిధగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివారు 6 మరణాలు సంభవించాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: