దేశంలో ఇప్పుడు కరోనా పై యుద్దం కొనసాగుతుంది.  కనిపించని శత్రువుతో ప్రతి ఒక్కరూ తెలియకుండానే యుద్దం చేస్తున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దారుణమైన వైరస్  ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది.  తాజాగా దీని ప్రభావం భారత్ పై పడింది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయి.  పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కఠిన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి.

 

పెనుగొండలో మసీదు వీధి, ఉర్రేంకుల వారి వీధి, కొండపల్లివారి వీధిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో వీటి పరిధిలో 820 మీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా ప్రకటించారు.  మరోవైపు పెనుగొండ కరోనాకు నెలవుగా మారడంతో వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజ్ఞప్తిచేశారు. కరోనా నిరోధానికి పెనుగొండలో తీసుకొంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.  కరోనాని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని.. ఈ నేపథ్యంలో  మూడు ప్రమాదకర ప్రాంతాలను కలిపి రెడ్‌జోన్‌గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

 

పెనుగొండ పంచాయతీలో కాల్‌సెంటర్‌ 08819–246081 నంబర్‌ ఏర్పాటు చేశారు. ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే అత్యవసరమైన నిత్యావసరాలు, మందులు వారి చెంతకే అందేవిధంగా ఏర్పాటు చేశారు. వీటికి నగదు చెల్లించాలి. లాక్ డౌన్ పదే పదే ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరైనా డ్రోన్‌లకు చిక్కితే కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: