కరోనా మహమ్మారి కట్టలు తెంచుకొని విరుచుకుపడుతున్న వేల దేశ జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ శనివారం ప్రధానమంత్రి లాక్ డౌన్ పొడిగించాలా లేదా అన్న విషయమై పలు రాష్ట్రాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . సమావేశంలో పది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య మంత్రులు లాక్ డౌన్ పొడిగింపునకు మొగ్గు చూపారు .

ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కరోనా పాసిటివేళ సంఖ్యా నానాటికి పెరిగిపోతోంది. నిన్నటివరకు 1554 కేసులు నమోదు కాగా గడచిన పన్నెండు గంటల్లోమహారాష్ట్రలో మొత్తం  కరోనా పాజిటివ్ కేసులు 92  నమోదు కావడం జరిగింది. అయితే మహారాష్ట్రలో మొత్తంగా 1666 కేసులు నమోదు అయ్యాయి . మరియు ఇప్పటివరకు 110 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఇంకా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు . ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా ఇప్పటి వరకు 7500 కాగా 258 మంది మృత్యువాత పడ్డారు 

మరింత సమాచారం తెలుసుకోండి: