దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు బయటకు రాకుండా ఎంత కట్టడి చేసినా.. ఈ కరోనా మహమ్మారి మాత్రం రోజు రోజుకీ తన ప్రతాపాన్ని చూపించుకుంటూనే ఉంది.  అయితే కరోనా వ్యాప్తికి ఎక్కువగా  సామాజిక దూరం పాటించకపోవడం.. కరోనా లక్షణాలు ఉన్నవారు గోప్యంగా ఉంటూ జనాల్లో తిరగడం అని అంటున్నారు. అంతే కాదు ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన  వారి వల్లనే ఈ కరోనా ఎక్కువగా విస్తరిస్తుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.  గత నెల ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి ఎక్కువగా కరోనా వైరస్ సోకడం వారు సరైన సమయానికి ట్రీట్ మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతూ వస్తుంది.  

 

ఒకదశలో దేశలో కొన్ని కేసులకు ఇదే కారణం అని అంటున్నారు.  తాజాగా కొమురంభీమ్ జిల్లాలో తొలి సారి రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లాలోని  జైనూరుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఇద్దరు బాధితులు గత నెల  నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళి వచ్చినట్టుగా గుర్తించారు.  అయితే ఈ పాజిటీవ్ వచ్చిన వారు ఇద్దరూ 25 వయసు లోపు ఉన్నవారే.. 14 ఏళ్ళు మరొకరికి 21 ఏళ్ళు ఉంటాయి.

 

జైనూర్ మండల కేంద్రంలోని ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో జైనూర్ మండలాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. జిల్లాలో మొదటిసారి కేసులు నమోదు కావడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.  అయితే వీరిని కరోనా పాజిటీవ్ రావడంతో ఇద్దరినీ రాత్రికి రాత్రి గాంధీ ఆస్పత్రి కి తరలించినట్టు డిఎంహెచ్ఓ తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: