తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభమైంది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న నిర్వహిస్తున్న ఈ స‌మావేశానికి మంత్రులంతా హాజ ర‌య్యారు. ప్ర‌ధానంగా ఈ స‌మావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు లాక్ డౌన్ ఒక్క‌టే స‌రైన ప‌రిష్కార‌మ‌ని , మ‌రికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని ఇది వ‌ర‌కే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాని మోడీని  కోరిన సంగ‌తి తెలిసిందే.  

 

ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ పెంపున‌కు మొగ్గు చూపుతూ, ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలోనే తెలంగాణ‌లో కూడా ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.  

 

ఇంకా ఈ స‌మావేశంలో  ధాన్యం కొనుగోళ్లు, రైతుల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర‌పై కూడా మంత్రివ‌ర్గం చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా కేబినెట్ భేటీ అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా స‌మావేశంలో మాట్లాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: