ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ తొలగింపుపై చెల‌రేగిన రాజ‌కీయ దుమారం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ అంశంపై అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మా ట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యంపై టీడీపీతోపాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ, జ‌నసేన పార్టీలు  ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, ప్ర‌భు త్వం మాత్రం త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటోంది. 

 

తాజాగా ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. న్యాయ‌కోవిదుడైన క‌న‌గ‌రాజ్‌కు ఏపీ ఈసీగా నియమించ‌డంపై చంద్రబాబు అన‌వ‌స‌ర‌మైన రాద్ధాంతం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ర‌మేశ్‌కుమార్ మాత్ర‌మే ఎస్ ఈ సీకి అర్హుడు కాద‌ని, ద‌ళితుడైన క‌న‌గ‌రాజ్‌ను ఉన్న‌త స్థానంలో కూర్చోబెట్టిన సీఎం జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. 

 

న్యాయ‌కోవిదుడైన ఎస్ ఈసీ స్థానంలో ఉంటే చ‌ట్టాల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తాడ‌ని, వ్య‌క్తులు శాశ్వ‌తంకాద‌ని, వ్య‌వ‌స్థ‌లు శాశ్వ‌త‌మ‌ని  అన్నారు. చం ద్ర‌బాబుకు వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేద‌ని మండిప‌డ్డారు. వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా న‌డ‌పాల‌న్నదే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని అంబ‌టి అన్నారు. గ‌వ‌ర్న‌ర్ ఆమో దంతోనే ఈసీ ఆమోదం పొందార‌ని అయ‌న పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: