మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌ల రేపుతోంది. అందులోనూ దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో అయితే.. వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. శనిన‌వారం ఒక్క‌రోజే 189 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వెల్ల‌డించింది. అదేవిధంగా 11 మంది మృతి చెందిన‌ట్లు తెలిపింది. దీంతో ముంబైలో మొత్తం క‌రోనా కేసులు 1182 న‌మోద‌వ‌గా..ఇప్ప‌టివ‌ర‌కు 75 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. వీరిలో వ‌యోవృద్దులు, ఇత‌ర స‌మ‌స్య‌లున్న‌వారున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 17వంద‌ల‌కు చేరువ‌లో ఉంది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ముంబైలో సుమారు 90మందికిపైగా వైద్య సిబ్బందికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. వారంద‌రికీన క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప‌రిణామాలు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

 

ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే కీల‌క‌నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే ఇదే విష‌యాన్ని సూచించారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్ పొడిగించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఇక వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి మ‌రింత క‌ఠినంగా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దేశంలోనే అత్య‌ధిక‌ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్రం మొద‌టి స్థానంలో ఉంది. దీంతో క‌రోనా క‌ట్ట‌డికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లను మ‌రింత ప‌క‌డ్బందీగా చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌ఠాక్రే భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: