తెలంగాణలో కరోనా కట్టడి చేయడానిక ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా మని అన్నారు సీఎం కేసీఆర్.   మహారాష్ట్రలో ఈ ఒక్కరోజే 11 మంది చనిపోయినట్టు వార్త వచ్చింది.. అంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుందని అన్నారు.  రాజస్థాన్లో ఒక్కరోజే 117 మందికి వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా సీరియస్ గా ఉందని అన్నారు.  మనకు మహరాష్ట్ర చాలా లాంగ్ బార్డర్.. భయపడాల్సిన పనిలేదు అన్నారు. అయితే అక్కడ నుంచి మన బంధుత్వాలు.. వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి.  కర్నాటక నుంచి వచ్చే ప్రమాదం కూడా ఉంది.. అందుకే బార్డర్ల వెంటన పటిష్టమైన కట్టుదిట్టాలు చేశామన్నారు.  క్యాబినెట్ మీటింగ్ లో చాలా సీరియస్ అంశాలపై చర్చలు జరిపామని.

 

లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ ఇబ్బంది పడొద్దని అందరి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.  కెబినెట్ మీటింగ్ లో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.  దాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.  అయితే ఈ విషయంలో ప్రజలు సహకరించాలి.. లాక్ డౌన్ ఉల్లంఘన ఎట్టి పరిస్థితుల్లో పాల్పడొద్దని అన్నారు.  ఇది మన క్షేమం కోసం.. మన పిల్లల భవిష్యత్ కోసమే అని మళ్లీ మళ్లీ విన్నవించుకుంటున్నానని అన్నారు.  

 

అందరి మంచి కాంక్షించే చేసే పని కాబట్టి గతంలో ఎలా సహకరించారో.. ఇప్పుడు కూడా అలాగే సహకరించాలని అన్నారు.  అన్ని కులాల వారు.. అన్ని మతాల వారు.. సామూహికంగా ఒక దగ్గర చేరే కార్యక్రమాలు మానుకోవాలని అన్నారు.  అంతా సర్ధబాటు అయితే.. ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ఎత్తి వేద్దాం.. ఒకేసారి ఎత్తి వేసినా ప్రమాదం పొంచి ఉంటుంది.   అందరూ జాగ్రత్తగా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: