కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా నిత్యావ‌స‌రాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.  

 

కాబినెట్ స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.  లాక్‌డౌన్ వ‌ల్ల  కంటైన్మంట్ ప్రాంతాల‌ను పూర్తిగా దిగ్బంధించినట్లు తెలిపా రు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల‌గకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. 

 

కంటెన్మెంట్  ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కురావొద్ద‌ని, అదే విధంగా కొత్త వారు కూడా ఆయా ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కూడద‌న్నారు. ప్ర‌భు త్వం నియ‌మించిన వ్య‌క్తులే కంటైన్మంట్ ప్రాంతాల‌కు వెళ్లి నిత్యావ‌స‌ర స‌ర‌కుల‌ను పంపిణీ చేస్తార‌ని సీఎం చెప్పారు.

 

నిత్యావ‌స‌రాల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌ని తెలిపారు.  ప్ర‌జ‌లెవ‌రూ అధైర్య‌పడొద్ద‌ని ఆయ‌న సూచించారు. ద‌య‌చేసి ప్ర‌జ‌లంతా  లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి, క‌రోనాను త‌రిమికొట్టాల‌ని  సీఎం కేసీఆర్ మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: