దేశ ప్రజలను నిద్ర పట్టకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసే విధానాలు ఇప్పటి వరకు తెలీట్లేదు . దేశంలో నానాటికి కరోనా కేసులు పెరిగి పోతున్నాయి నిన్న ఒక్క రోజే దేశం లో పాజిటివ్ లసంఖ్య 1400 లకు పైన కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసుల సంఖ్యా నానాటికి పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 405  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి , అందులో గుంటూరు లో 17 కేసులు , కర్నూల్ లో 5 పాజిటివ్ కేసులు మరియు ప్రకాశం పర్యు కడప జిల్లాల నుండి ఒక్కొక్కటి నమోదు కావడం జరిగాయి. 

 

అసలు విషయం ఏమిటంటే నిన్న గుంటూరు నుండి నమోదు అయిన 17 కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 11 మంది పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు . వీరిలో ఇద్దరు మహిళలు మరియు 10 ఏళ్ళ లోపు బాలికలు ఉన్నారు . అయితే అదేవీధిలో 22  పాజిటివ్ కేసులు ఇదివరకే నమోదు కావడం గమనర్హం, అయితే ఆ వీధిలో వారంతా భయాందోళనలో ఉన్నారు . అదేవిదం గా వేరే వీధిలో 6 కరోనా ఉన్నట్లు గుర్తించారు . వెరసి గుంటూరులో ఇప్పటి వరకు 75 పాజిటివ్ కేసులు ఉన్నాయి . అయితే గుంటూరులో చాలాప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్ర్రభుత్వం ఇప్పటికే గుర్తించింది . నిత్యావసరాలు కోసం ప్రజలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించారు అదేవిధంగా  ఏరియాల వారీగా నిత్యావసరాలను స్వయంగా ఇళ్లకు చేరుస్తున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: