ముంబై మహా నగరాన్ని కరోనా వైరస్ కాటేస్తోంది. శనివారం వరకూ 1,761 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ముంబైలోని మురికి వాడల్లోనే అధికంగా నమోదవుతున్నాయని అన్నారు. ముంబై, థానే, నవీ ముంబై, పల్గార్, పూణేలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.

 

ప్ర‌ధానంగా న‌గ‌రంలోని  ధారవిలో కోవిడ్ -19 కేసులు 43కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు ముంబై అధికారులు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్నధారవిలో కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలుతీసుకుంటోంది. 

 

స్థానిక ప్రజల రాకపోకలపై దృష్టి పెట్టామని పోలీసులు తెలిపారు. ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని.. కరోనా వైరస్ విస్తకరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నామని చెప్పారు. ధారవిని జోన్లుగా విభజించి.. ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో జనజీవనాన్ని స్తంభింప చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: