కరోనా వైరస్ ప్రభావం ఉల్లి మీద పడనుంది. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిగడ్డలను మార్కెట్లో విక్రయించడానికి మార్కెటింగ్ శాఖ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఉల్లిని దిగుబడి చేయరాదని, వాటిని ఆపేయాలని తాజాగా నిర్ణయించింది. 


సోమవారం నుంచి కేవలం తెలంగాణ జిల్లాల్లో పండించిన ఉల్లిగడ్డలను మాత్రమే మార్కెట్లలో విక్రయించాలని తెలంగాణ రైతులు తెచ్చే ఉల్లిగడ్డలను మాత్రమే కొనాలని వ్యాపారులను ఆదేశించింది.

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిగడ్డ లోడ్ లను మార్కెట్ సముదాయంలోకి రానివొద్దంటూ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉల్లి పంటలు అధికంగా పండాయని, ఉల్లి నిల్వలు చాలా ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఇతర రాష్ట్రాల ఉల్లిగడ్డ ప్రస్తుతానికి అవసరం లేదన్నారు. మార్కెట్ యార్డు నిర్ణయించిన ఈ నిబంధనలను టోకు వ్యాపారులు కూడా అంగీకరించారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: