కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ పొడిగించే విషయం గురించి మన ప్రధాన మంత్రి అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చేసిన సమావేశంలో పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కే మొగ్గు చూపారు .అదేవిధంగా పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో 10 లక్షల వేల ప్యాకేజీ ని విడుదల చేయవలసిందిగా పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా కోరారని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం 1.7 లక్షల కోట్లు ఏ మేర సరిపోతాయి అని మమతా ప్రధానిని ప్రశ్నించారు .

 

 ఇది ఇండియా జీడీపీ లో ఒక శాతం మాత్రమే అని చెప్పారు. అదేవిధముగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా తమ కాపిటల్ లో 10శాతం , బ్రిటన్ 15 శాతం మరియు జపాన్ 20 శాతం వెచ్చించాయని అదేవిధంగా భరత్ కూడా వారి కి తగ్గట్టుగా 10 లక్షల వేల ప్యాకేజీ ని విడుదల చేయవలసిందిగా కోరారు .ఇది మన జీడీపీ లో 6 శాతం మాత్రమేనని వివరించారు . లాక్‌డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. ఇదే విషయాన్ని ప్రధాని కూడా వ్యక్తం చేశారు.. కష్టమైనా ప్రాణాలు కాపాడుకోవాలంటే తప్పదని అన్నారు. బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సక్రమంగా అమలుకావడం లేదన్న కేంద్రం వాదనను మమత తోసిపుచ్చారు. ఈ  సమయంలో ఎలాంటి ఆరోపణలు సరికాదని మమతా స్పందించారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: