భార‌త్‌కు దాయాది దేశ‌మైన పాకిస్తాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ముందుగా పాకిస్తాన్‌లో క‌రోనా ప్ర‌భావం అంత ఎక్కువ ఉండ‌ద‌ని అనుకున్నా ఎప్పుడు అయితే క‌రోనా వైర‌స్ అక్క‌డ పాక‌డం మొద‌లు పెట్టిందో చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5000 దాటింది. ఇక్క‌డ ఉన్న 5 వేల కేసుల్లో అందులో సగానికిపైగా కేసులు పంజాబ్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ఖైబ‌ర్ పక్తుంఖ్వా ప్రాంతంలోనూ ఎక్కువ కేసులు న‌మోదు అయిన‌ట్టు పాకిస్తాన్ ప్ర‌భుత్వ అధికారులు చెపుతున్నారు.

 

పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం 2,425 కరోనా కేసులు నమోదవగా.. అందులో పక్తుంఖ్వా ప్రాంతంలోనే 620 కేసులున్నాయి. వీరిలో 201 మంది హెల్త్ సెంటర్లలో ఉన్నారు. 181 మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ 20 మంది మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లోనే 22 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్ తర్వాత 1,318 కేసులతో సింధ్ ప్రావిన్స్‌ రెండో స్థానంలో ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: