కరోనా క‌ట్ట‌డికి గుజరాత్ లోని అహ్మ‌దాబాద్ నగరపాలక సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో  మరిన్ని కఠిన ని బంధనలకు సిద్ధమైంది. ఇకపై ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, లేకుంటే రూ. 5 వేల జరిమానా లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉం టుందని హెచ్చరికలు జారీ చేసింది.

 

 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ఈ ఆదేశాలు జారీ చేశారు. రేపటి (సోమవారం) నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఉదయం ఆరు గంటల నుంచి నగర పరిధిలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరని క మిషనర్ పేర్కొన్నారు. 

 

మాస్క్ లేకుండా కనిపించిన వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని, చెల్లించడంలో విఫలమైతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్లో దొరికేవైనా, ఇంట్లో తయారుచేసిన వైనా ఫరవాలేదని ఆయన వివరించారు. కనీసం ముఖానికి రుమాలైనా కట్టుకోవాలని సూచించారు. కాగా నగరంలో ఇవాల 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 266కు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: