కరోనా క‌ట్ట‌డికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన విషయం తెల్సిందే.  లాక్ డౌన్ విధించకుంటే లక్షల్లో కేసులు, వేలల్లో మ రణాలు నమోదు అయ్యేవి అంటూ ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.

 

అయితే లాక్ డౌన్ విధించిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. పేదలు, ముఖ్యంగా వలస కూలీలకు శాపంగా మారాయి. రోజు వారి కూలీలు లాక్ డౌన్ కారణంగా కనీసం తినడానికి తిండి లేక అల‌మ‌టించే ప‌రిస్థితి నెల‌కొంది. 

 

ఈ నేప‌థ్యంలో వ‌ల‌స కూలీల‌ను ఉద్ధేశించి వ‌ర‌ల్డ్ బ్యాంక్  కీల‌క ప్ర‌క‌టన చేసింది.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వెళ్తున్న వ‌ల‌స కూలీల వ‌ల్ల క‌రోనా వైరస్ వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించంది.

 

వీరంతా వైర‌స్ వాహ‌కుల‌కు మారి ఆయా గ్రామాల్లో వైర‌స్ ను వ్యాప్తి చేసే అ వ‌కాశం ఉంద‌ని పేర్కొంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయి వ‌ల‌స కూలీలు ఆక‌లితో అల‌మటించ‌లేక స్వ‌స్థ‌లాల‌కు ఖాళీ న‌డ‌క‌న వెళ్తున్నార‌ని, వ‌ల‌స కూ లీల‌ను ఆదుకోవాల‌ని , ఆహారం నీరు అందించాల‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: