క‌రోనా క‌ట్ట‌డికి 24 గంటల్లోనే అధికారులు మరో 10 హాట్‌స్పాట్లను గుర్తించారు.  దీంతో మొత్తం హాట్ స్పాట్ల సంఖ్య 43కి చేరుకుంది. గురువారం ఇవి 25గా ఉండగా, శుక్రవారం 30కి పెరిగాయి. శనివారం 33గా ఉండగా నేటి సాయంత్రానికి వాటి సంఖ్య 43కి పె రిగింది. నగర వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

 

నేడు గుర్తించిన హాట్‌స్పాట్లలో దక్షిణ ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ కాలనీ, మాదాన్‌పూర్ ఖదర్, అబ్దుల్ ఫజల్ ఎన్‌క్లేవ్, జైట్‌పూర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఖడ్డా కాలనీ, మహావీర్ ఎన్‌క్లేవ్‌లోని బెంగాలీ కాలనీ, షేరా మొహల్లా గార్హి వంటివి ఉన్నాయి.  

 

కంటైన్‌మెంట్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా, హై రిస్క్ ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రాజధానిలోని మరిన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: