క‌రోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప‌లు రాష్ట్రాలు మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇక మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌ల రేపుతోంది. సుమారు రెండువేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క‌ముంబైలోనే సుమారు వెయ్యికిపైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్ర ఉద్ద‌వ్ ఠాక్రే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

 

ఈ నెల 30వ లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇక ఇత‌ర రాష్ట్రాలతో ఉన్న స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో తెలంగాణ‌కు కావాల్సిన అన్ని దిగుమ‌తులు నిలిచిపోయాయి. తెలంగాణ‌కు అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ఆదిలాబాద్‌, త‌దిత‌ర జిల్లాల‌తో ఉన్న స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు. దీంతో తెలంగాణ‌పై నిత్యావ‌స‌ర స‌రుకుల కొర‌త ప్ర‌భావంగా పడుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: