ఇండియాలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ విస్త‌రిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 9,205 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణించిన వారి సంఖ్య 331కు చేరుకుంది. ఇక సుమారు 764మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడులో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగా, ఏప్రిల్ 14తో దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గడువు ముగుస్తోంది.

 

దీంతో ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతార‌ని, లాక్‌డౌన్ పొడిగింపు కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఇదిలా ఉండ‌గా.. కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం కోసం దేశ‌ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: