రేప‌టితో అంటే ఏప్రిల్ 14తో దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు ముగియ‌నుంది. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు రాత్రి దేశ ప్ర‌జ‌ల‌కు సందేశం ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం వెల్ల‌డిస్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే.. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను పొడ‌గించ‌డం ఖాయ‌మేగానీ.. దేశ‌వ్యాప్తంగా ఒకే విధమైన లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తారా..?  లేక క‌రోనా వైర‌స్ లేని ప్రాంతాల్లో ఏమైనా స‌డ‌లింపులు ఇస్తారా..? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది.

 

ఇప్ప‌టికే దేశాన్ని మూడు జోన్లుగా విభ‌జించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాలు ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. నిజానికి .. ఇటీవ‌ల నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనూ ముఖ్య‌మంత్రులంద‌రూ లాక్‌డౌన్‌ను పొడిగించాల‌నే సూచించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం కోసం దేశ‌ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: