మధ్యప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర స్థాయిలో క‌నిపిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 542 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 41మంది చ‌నిపోయారు. ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క‌రోనాను క‌ట్ట‌డిచేయ‌లేక అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికీ రాష్ట్రంలో మంత్రివ‌ర్గం లేదు. ఆరోగ్య‌శాఖ మంత్రి లేరు. దీంతో క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయాలో.. ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క సీఎం స‌త‌మ‌తం అవుతున్నారు.  ఇక ఆ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ కూడా అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉంది. ఇక్క‌డ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు, వారి కుటుంబ స‌భ్యులంద‌రూ కూడా క‌రోనా వైర‌స్‌బారిన ప‌డ‌డం గ‌మ‌నార్హం.

 

దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పల్లవి జైన్ గోవిల్, హెల్త్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్  రాష్ట్ర ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చీఫ్  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె విజయ్ కుమార్ కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. భోపాల్‌లో ఆదివారం మధ్యాహ్నం వరకు , 80 మంది ఆరోగ్య శాఖ అధికారులు, వారి కుటుంబ సభ్యులతో సహా 134 మందికి క‌రోనా సోకిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కరోనావైరస్ కంట్రోల్ రూమ్‌లో కూడా క‌రోనా క‌ల‌క‌లం రేపింది. అదనపు డైరెక్టర్, హెల్త్ కమ్యూనికేషన్ వీణా సిన్హా , అలాగే మరొక అధికారి పల్లవ్ దుబేకు కూడా క‌రోనా సోకింది. దీంతో ముఖ్య‌మంత్రి నానాక‌ష్టాలుప‌డుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: