ఇక మందుబాబుల‌కు పండుగే.. మ‌ద్యం దొర‌క‌ద‌న్న రందిలేదు. తాగినోళ్ల‌కు తాగినంత మందు. రెండు రాష్ట్రాలు అసోం, మేఘాల‌య‌లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి. నేటి నుంచే మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభం అవుతున్నాయి. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్ర ఆరు గంట‌ల‌కు వ‌ర‌కు మ‌ద్యం షాపులు తెరిచి ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. దీంతో మందుబాబులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌ర సేవ‌లు త‌ప్ప అన్నీ నిలిచిపోయాయి.

 

దాదాపుగా అన్నిరంగాల కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. దీంతో మ‌ద్యం దొర‌క‌క మందుబాబ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఒక‌దేశ‌లో చాలామంది తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గురై పిచ్చిపిచ్చి చేస్తున్నారు. ఇక ప‌లువురు మ‌ద్యానికి బ‌దులు శానిటైజ‌ర్లు తాగి ప్రాణాలు కూడా కోల్పోయారు. త‌మిళ‌నాడులో ఏకంగా 11మంది మ‌ర‌ణించారు. ప‌లుచోట్ల దాడులు కూడా జ‌రిగాయి. ఇక తెలంగాణ‌లో ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రిలో మ‌ద్యం బాధితుల‌తో నిండిపోయిన విష‌యం తెలిసిందే. ఇక అసోం, మేఘాల‌య దారిలోనే మ‌రికొన్ని రాష్ట్రాలు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆదాయం అమాంతంగా పెర‌గాలంటే ఇదే బెట‌ర్ ఆప్ష‌న్‌గా ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: