క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తోంది. ప్ర‌తీరోజు వేలమంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా 109,000 మందికి పైగా మరణించారు. సుమా 18ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటివరకు, అమెరికాలోఆరు ల‌క్ష‌ల మందికిపైగా పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. ఇక మరణాల సంఖ్య 22,000 దాటింది. ఆ త‌ర్వాత‌ స్పెయిన్‌లో అత్య‌ధికంగా 16,972మంది మృతి చెందారు.

 

అయితే.. క్ర‌మంగా రోజువారీగా న‌మోదు అవుతున్న‌ మ‌ర‌ణాల సంఖ్య‌ సంఖ్యలో మాత్రం త‌గ్గ‌ద‌ల క‌నిపిస్తోంది. ఆదివారం ఒక్క‌రోజే సుమారు 619 మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఇట‌లీతోపాటు ప‌లు యూర‌ప్‌దేశాలు, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఇక‌ ఇండియాలో కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ విస్త‌రిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 9,205 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణించిన వారి సంఖ్య 331కు చేరుకుంది. ఇక సుమారు 764మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: