తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ విస్త‌రిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి వ‌ర‌కు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌తో ఏడుగురు మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక తెలంగాణలో ఆదివారం రాత్రి వ‌ర‌కు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 531కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.

 

కరోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుని 103 మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్ల‌డించారు. ఏపీలో ఎక్కువ‌గా క‌ర్నూలు, గుంటూరులో ఎక్కువ‌గా కేసులు న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో అధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లను అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: