లాక్‌డౌన్ నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే ప్ర‌భుత్వం మినహాయింపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.. లాక్‌డౌన్‌ సమయంలో వైద్య సిబ్బంది, పో లీసులు, జీహెచ్‌ఎంసీ, పారిశుధ్యం, మీడియా, వాటర్‌ బోర్డు తదితర విభాగాల వాళ్లు సేవలందిస్తున్నారు.

 

వీరిలో ఎవరిదైనా బైక్‌ ఆగిపోతే తోసుకుంటూ వెళ్తున్నారు. ఆటోలు, ట్రాలీలు, కార్లను ఎక్కడ ఆగితే అక్కడే వదిలిపెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా నిత్యావసరాలను ట్రాలీల్లో రవాణా చేస్తున్నారు. వాహ నాలు ఆగిపోవడంతో సరుకు రవాణాకు ఆటంకం కలుగుతోంది. 

 

అయితే అత్య‌వ‌స‌ర సేలందిస్తున్న ప‌లువురు వైద్యులు కూడా ఈ లాక్‌డౌన్‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి హైదరాబాద్‌లో జ రిగింది. విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరిన ఓ డాక్టర్‌ కారు ఇంజ‌న్‌లో స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో న‌డి రోడ్డు మీదనే ఆగిపోయింది.

 

అయితే మెకాని క్‌కు ఫోన్‌ చేద్దామంటే... వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తోచక ఆ డాక్టర్‌ కారును అక్కడే వదిలి సహచర వైద్యుడి సాయంతో ఆస్పత్రికి వెళ్లాడు. మెకానిక్‌ సేవలు అత్యవసర పరిధిలోకి రాకపోవడంతో షాపులు తెరవడం లేదు. వాహనాల స్పేర్‌పార్ట్‌లు కూడా అందుబాటులో లేవు. దీంతో నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలపైనా పైనా ప్రభావం పడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: