వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం గ‌త కొంత‌కాలంగా గ్రామస్తులు ఉద్యమిస్తున్న విష‌యం తె లిసిందే.  ప్రాణాంతక మహమ్మారి కోవిడ్ 19 ఉన్నా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు గాను పోలీసులు ఈ నోటీసులు పంపించారు. కోవిడ్ 19 మూలంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. 

 

12 నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని.. లాక్‌డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, క‌లిశార‌ని నోటీసులో తెలిపారు. అయితే జిల్లాలో సెక్షన్ 144 సి‌ఆర్‌పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున.. సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం అంటూ మహిళా రైతులకు, రై తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 

'ఈ కారణాల మూలంగా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయాలి అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాగా లా‌క్‌డౌన్ సమయంలో అమరావతి ఉద్యమాన్ని కొనసాగించారంటూ పోలీసులు నోటీసులు పంపడంపై జిల్లా ఎ స్పీకి వెంకటపాలెం రైతులు లేఖ రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: